తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఓపెన్ లెటర్ రాసిన శ్రీరెడ్డి - Mega Indian News

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Friday

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఓపెన్ లెటర్ రాసిన శ్రీరెడ్డి


వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఆమె వార్తల్లో లేనిది ఎప్పుడులే అనుకోకపోతే.. ఈసారి కాస్త డిఫెరెంట్ వే‌లో వార్తల్లో నిలిచింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఓపెన్ లెటర్ రాసింది. రాస్తే రాసింది.. కేసీఆర్‌ని నాన్న అంటూ మీ కూతురు శ్రీరెడ్డి వ్రాయునదని నాలుగు పేజీల లేఖను తన స్వహస్తాలతో రాసింది శ్రీరెడ్డి. 

నాన్నగారూ.. ఈ మాటతో మిమ్మల్ని పిలుస్తున్నప్పుడు నా కళ్లు నీళ్లతో నిండు కుండలుగా అయిపోయాయి. ఈ మాట, పిలుపుకు దూరమై దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది’.. అంటూ గుండెల్ని పిండేసే ఎమోషనతో శ్రీరెడ్డి లేఖను రాసింది.
 

గౌరవనీయులైన.. ఉద్యమాన్ని ఊపిరిగా బతికి తెలంగాణ మొత్తానికి తండ్రి సమానులైన మా ప్రియతమ, ప్రాణ సమానులైన మా తండ్రి
 కేసీఆర్ గారికి నమస్కరించి మీ పాదాలను ప్రార్దిస్తూ శ్రీరెడ్డి అను కూతురు సమానురాలైన నేను వ్రాస్తున్న ప్రార్ధనా పూర్వక లేఖ’.. అంటూ మొదలుపెట్టిన ఈ లేఖలో ముఖ్యంగా టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్‌ని ప్రస్తావించింది శ్రీరెడ్డి. 

అవకాశాల పేరుతో అమ్మాయిల్ని ఎలా వేధిస్తున్నారు.. వాళ్లను ఎలా వాడుకుని సెక్స్‌కి బానిసలుగా చేస్తున్నారు? తెర వెనుక ఎలాంటి బాగోతాలు నడుస్తున్నాయి తదితర విషయాల్ని ప్రస్తావించింది శ్రీరెడ్డి.

కాగా సినిమా ఇండస్ట్రీలో ఈ తెరచాటు బాగోతాలకు బాధితులు కాకుండా ఉండేందుకు వాళ్లను రక్షించేందుకు ఓ ప్యానల్‌ను ఏర్పాటు చేస్తూ జీవోను అధికారికంగా విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్యానల్‌లో నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, నందినిరెడ్డి తదితర 15 మంది సభ్యులుగా ఉన్నారు. 
గతంలో శ్రీరెడ్డి.. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో అర్ధనగ్న ప్రదర్శన ద్వారా ఉద్యమానికి ఊపుతెచ్చింది. ఆమెకు మహిళా సంఘాలు బాసటగా నిలవడంతో పాటు వారి పోరాట ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్‌ను అరికట్టేందుకు ఈ జీవోను విడుదల చేసిన విషయం తెలిసిందే.
 

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages