పదోతరగతి పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి.
ఉదయం 11.30 గంటలకు సచివాలయం ‘డీ’బ్లాక్
సమావేశ మందిరంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో దాదాపు 5
లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకాగా..92.43
శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.68 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 91.18గా ఉంది. ఇక 99.30
శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా..89.09 శాతంతో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో మొత్తం 2,125
పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 21
పాఠశాలలు సున్నా ఉత్తీర్ణతను నమోదుచేశాయి.
జూన్ 10 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు:
పదోతరగతి పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 10 నుంచి 24 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఫలితాల వెల్లడి అనంతరం విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు మే 27లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఆయన వెల్లడించారు.

ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించిన పదోతరగతి పరీక్షలకు మొత్తం 5.46 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరికి సంబంధించిన ఫలితాలను సోమవారం వెల్లడించారు. ఫలితాల వెల్లడి రోజు అంటే.. మార్చి 13 నుంచే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. మార్చి 27 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
No comments:
Post a Comment