ఆంధ్రప్రదేశ్‌లో
పదోతరగతి పరీక్షల ఫలితాలను మంగళవారం (14-05-2019) ఉదయం
ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో కమిషనర్ సంధ్యారాణి విడుదల
చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,21,634 మంది విద్యార్థులు
పదోతరగతి చదవగా వీరిలో 99.5%మంది పరీక్షలకు హాజరయ్యారు.
పదో
తరగతి పరీక్షల్లో 94.88 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 94.68 శాతం, బాలికలు 95.09 శాతం
ఉత్తీర్ణత సాధించినట్లు సంధ్యారాణి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం
ఉత్తీర్ణత సాధించారు. మూడు
పాఠశాలల్లో సున్నాశాతం ఫలితాలు నమోదయ్యాయి. అందులో రెండు ప్రైవేటు పాఠశాలలు, ఒక ఎయిడెడ్ స్కూల్ ఉన్నాయి. ఫలితాల్లో
తూర్పుగోదావరి జిల్లా 98.19 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. 83.19
శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు జిల్లా చివరి
స్థానంలో నిలిచింది.
Results Link 1 : Click Here
Results Link 2 : Click Here
No comments:
Post a Comment