‘అభినేత్రి 2’ ఫస్ట్‌లుక్ టీజర్. ||ప్రభుదేవా || తమన్నా || నందితా శ్వేతా. - Mega Indian News

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday

‘అభినేత్రి 2’ ఫస్ట్‌లుక్ టీజర్. ||ప్రభుదేవా || తమన్నా || నందితా శ్వేతా.


ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవా హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా 2016లో వచ్చిన చిత్రం అభినేత్రి’. సోనూసూద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సీక్వెల్‌గా అభినేత్రి 2’ చిత్రం రూపొందుతోంది
అభినేత్రి 2’లో ప్రభుదేవా, తమన్నాలతో పాటు నందితాశ్వేత, డింపుల్‌ హయాతి, కోవై సరళ కీలక పాత్రల్లో నటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. అభినేత్రిలో ఒక్క దెయ్యమే భయపెడితే.. ఈ సినిమాలో మాత్రం రెండు దెయ్యాలు భయపెట్టనున్నాయి అని ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది అందుకేనేమో టైటిల్‌ని కూడా అభినేత్రి+2’ అని రాశారు. 


టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో నందితా శ్వేత కాస్త హాట్‌గా కనిపించనున్నట్టు అర్థమవుతోంది. అభినేత్రిలో రూబీ ఆత్మ దేవి(తమన్నా)ని ఆవహిస్తుంది. అయితే, ఈ సినిమాలో అలెక్స్ అనే కొత్త ఆత్మ పరిచయం అవుతుంది. ఈ ఆత్మ కృష్ణ (ప్రభుదేవా)ను ఆవహించనున్నట్లు టీజర్‌‌ను చూస్తే అర్థమవుతోంది. మొత్తం మీద మరోసారి ప్రభుదేవా, తమన్నా ప్రేక్షకుల్ని నవ్విస్తూ భయపెట్టనున్నారు. . ట్రైడెంట్‌ ఆర్ట్స్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకాలపై అభిషేక్‌ నామా, ఆర్‌.రవీంద్రన్‌ నిర్మిస్తున్నారు. తొలిభాగాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ విజయ్‌ ఈ చిత్రానికీ కూడా దర్శకత్వం వహించారు. 

ఈ చిత్రానికి సామ్‌ సి.ఎస్‌. సంగీతం సమకూర్చారు. అయాంకా బోస్‌ సినిమాటోగ్రఫీ అందించారు. సత్య డైలాగ్స్ రాశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages