టీమిండియా
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య, బ్యాట్స్‌మెన్ కేఎల్
రాహుల్‌లకు బీసీసీఐ అంబుడ్స్‌మన్ షాకిచ్చింది. ‘కాఫీ విత్
కరణ్ ’ టీవీ షోలో అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా
క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలకు రూ. 20 లక్షల చొప్పున బీసీసీఐ
అంబుడ్స్‌మన్ డీకే జైన్ జరిమానా విధించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది పారా మిలటరీ అమర జవానుల కుటుంబాలకు ఇద్దరూ లక్ష రూపాయల చొప్పున
చెల్లించాలని ఆదేశించారు. అంధుల క్రికెట్ అసోసియేషన్‌కు చెరో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని సూచించారు నాలుగు వారాల్లోగా వీరిద్దరూ ఈ
మొత్తాన్ని చెల్లించాలన్నారు. ఒకవేళ జరిమానా
చెల్లించకుంటే వీరికి ఇచ్చే మ్యాచ్ ఫీజులోంచి బీసీసీఐ తీసుకోవాలని అంబుడ్స్‌మన్
ఆదేశించారు.
వివాదాస్పద వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా పర్యటన నుంచి
వెనక్కు వచ్చేయడంతో ఇప్పటికే రూ. 30 లక్షల
చొప్పున ఆదాయం కోల్పోయారని జైన్ అన్నారు. దేశానికి రోల్ మోడల్స్‌గా నిలవాల్సిన
ఇద్దరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల ఇద్దరూ క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు.
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా
వ్యవహరించే ‘కాఫీ విత్ కరణ్’ షోలో హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ పాల్గొన్న
విషయం తెలిసిందే. ఈ షోలో భాగంగా వీరిద్దరూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర
దుమారానికి దారి తీసింది. దీంతో వీరిపై కొన్ని రోజుల పాటు వేటు కూడా పడింది.
No comments:
Post a Comment