తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో వివాదంపై కమిటీ | ఎలాంటి పొరపాట్లు జరిగినా సరిదిద్దుతాం - Mega Indian News

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Monday

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో వివాదంపై కమిటీ | ఎలాంటి పొరపాట్లు జరిగినా సరిదిద్దుతాం



ఇంటర్‌ పరీక్ష ఫలితాల విషయంలో ఏ ఒక్క విద్యార్ధికి అన్యాయం చేయబోమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, విదాయర్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ,ఫలితాల విషయంలో పొరపాట్లు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌లకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లు జరిగినా సరిదిద్దుతామని మంత్రి చెప్పారు. ఫలితాల సమయంలో చోటుచేసుకున్న అపోహలను తొలగించడానికి తెలంగాణ స్టేట్‌ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌ ఎండి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ కమిటీ సత్వరమే దర్యాప్తుచేసి, మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కమిటీలో వెంకటేశ్వరరావుతో పాటు హైదరాబాద్‌ బిట్స్‌ ప్రొఫెసర్‌ వాసన్‌, ఐఐటి హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ నిశాంత్‌ సభ్యులుగా ఉంటారని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ప్రొఫెసర్‌ వాసన్‌కు ఐటి మీద స్పష్టమైన అవగాహన ఉందని, ప్రొఫెసర్‌ నిశాంత్‌ పోటీ పరీక్షళ నిర్వహణలో నిపుణుడని పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages