(Image Source: Reuters)
ఈ విమానం పేరు..
స్ట్రాటోలాంచ్.. పంచంలోనే అత్యంత పెద్దదైన ఈ విమానం మొట్టమొదటిసారిగా శినివారం నింగిలోకి ఎగిరింది.
అమెరికాలోని
కాలిఫోర్నియా నుంచి బయలుదేరింది. ఈ మొదటి ప్రయోగం అద్భుతంగా సాగిందని విమాన పైలట్
ఎవాన్ థామస్ తెలిపారు.
ముఖ్యంగా.. ఎగిరే
లాంచ్ ప్యాడ్‌గా ఉపయోగపడనుంది. అందువలన రాకెట్స్ కోసం ప్రత్యేకంగా లాంచ్ పాడ్స్
అవసరం ఉండదు,అంతేకాకుండా..దీని సహాయంతో కక్ష్యలోకి చాలా చౌకగా ఉపగ్రహాలను
ప్రయోగించవచ్చు.
నేలమీద నుంచి 10 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నాక రాకెట్‌ను జారవిడిస్తుంది. ఆ
వెంటనే రాకెట్ ప్రజ్వలించి అంతరిక్షంలోకి దూసుకెళుతుంది.
ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడుతుంది.
స్ట్రాటోలాంచ్‌కు
విమానంను ఇప్పటివరకూ నేల మీదే పరీక్షలు నిర్వహించారు. అయితే తొలిసారిగా శనివారం
రెండున్నర గంటల పాటు అమెరికాలోని.. మొజావీ ఎడారిపై ప్రయోగాత్మకంగా నడిపారు.
ఈ సమయంలో ఈ స్ట్రాటోలాంచ్
విమానం గంటకు 304 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. 17వేల అడుగుల ఎత్తుకు వరకు చేరుకుంది.
స్ట్రాటోలాంచ్
విమానంకు దీనికి రెండు బాడీలు ఉంటాయి. ఈ విమానం వెడల్పు ఫుట్‌బాల్ మైదానం కన్నా
పెద్దగా ఉంటుంది. రెక్కల విస్తీర్ణం 117 మీటర్ల మేర ఉంది, కానీ బోఇంగ్ విమానం రెక్కల పొడువు కేవలం 90
మీటర్ల లోపే ఉంటుంది స్ట్రాటోలాంచ్‌విమానంకి ఏకంగా ఆరు ఇంజిన్లు ఉంటాయి. చిన్న చిన్న ఉపగ్రహాలను అతి తక్కువ ఖర్చుతో అంతరిక్చం లోకి ప్రయోగించే మార్కెట్‌లోకి ప్రవేశించాలన్న
ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్ ఈ ప్రాజెక్టును చేపట్టాను
అని తెలిపారు.
No comments:
Post a Comment