నేచురల్‌ స్టార్‌ "జెర్సీ" మూవీ ట్రైలర్.. - Mega Indian News

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Tuesday

నేచురల్‌ స్టార్‌ "జెర్సీ" మూవీ ట్రైలర్..


నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జెర్సీ’. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించారు, ఇందులో అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నాని కనిపిస్తున్నారు, ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక.

పదేళ్ల తర్వాత పెళ్లయి, ఓ పిల్లాడున్న అర్జున్ (నాని) జీవితంలో ఏదీ సాధించలేని వ్యక్తిగా, భార్య సంపాదనతో బతకడం, తనను హీరోగా చూసే కొడుకు కోసం అప్పులు చేయడం వంటి సన్నివేశాలు మనసును హత్తుకునేలా,కంటతడి పెట్టేలా ఉన్నాయి. 36ఏళ్ల వయస్సులో తిరిగి బ్యాట్ పట్టిన నాని ఎలాంటి ఇబ్బందులు మరియు అవమానాలు ఎదుర్కొన్నాడన్నది ట్రైలర్‌లో చూపించారు. పదేళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్లీ మొదలుపెడతా..అంటూ నాని ఉద్వేగంతో చెబుతున్న మాటలు హైలెట్‌గా నిలిచింది. 
నాని మ్యాచ్ ఆడేందుకు గ్రౌండ్‌లో అడుగుపెట్టడం, సహచర ఆటగాళ్లతో గొడవపెట్టుకోవడం, హీరోయిన్‌తో లవ్, రొమాన్స్ ఇలాంటి సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం(ఏప్రిల్ 12) విడుదల చేశారు. సినిమా ఏప్రిల్‌ 19జెర్సీప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 



No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages