క్రికెట్
ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో
ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వరల్డ్ కప్ మ్యాచ్ లు
జరగనున్నాయి. ఈ మెగా టోర్నీలో అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించే 16 మందితో ఐసీసీ జాబితా విడుదల చేసింది. దాంతోపాటు మ్యాచ్ రిఫరీలను కూడా
ప్రకటించారు. అంపైర్ల జాబితాలో భారత్ నుంచి ఒక్కరికే అవకాశం కల్పించారు. కర్ణాటకకు
చెందిన సుందరం రవి వరల్డ్ కప్ లో అంపైర్ గా విధులు నిర్వర్తిస్తాడు.
అంపైర్ల జాబితా: కుమార ధర్మసేన, అలీం
దార్, ఇయాన్ గౌల్డ్, పాల్ రీఫెల్,
మరాయిస్ ఎరాస్మస్, క్రిస్ గాఫెనీ, రిచర్డ్ కెటిల్ బరో, బ్రూస్ ఆక్సెన్ ఫర్డ్, నైగెల్ లాంగ్, సుందరం రవి, రాడ్
టకర్, జోయెల్ విల్సన్, రుచిర
పెల్లియగురుగె, పాల్ విల్సన్, మైకేల్
గాఫ్, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్.
మ్యాచ్ రిఫరీలు: క్రిస్ బ్రాడ్, డేవిడ్
బూన్, ఆండీ పైక్రాఫ్ట్, జెఫ్ క్రో,
రంజన్ మదుగలే, రిచీ రిచర్డ్సన్.
No comments:
Post a Comment