ప్రముఖ
దర్శకుడు రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా
ఏపీలో విడుదల కానుంది. ఏపిలో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఈ సినిమా విడుదలపై అక్కడి
కోర్ట్ స్టే విధించింది, మే 1న ‘లక్ష్మీస్
ఎన్టీఆర్’ను ఏపీలో విడుదల చేస్తున్నామని డైరెక్టర్ వర్మ
వెల్లడించారు. ఎన్టీఆర్ అనుభవించిన నరకం ఏపీ ప్రజలు తెలుసుకోబోతున్నారని ట్విటర్‌లో
తెలిపారు. అత్యంత వివాదాస్పదమైన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని
ప్రాంతాల్లో మార్చి 29న రిలీజ్
అయి ఘనవిజయం సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయ్యే వరకు రిలీజ్‌పై
హైకోర్టు స్టే విధించటంతో అప్పటినుంచి చిత్రయూనిట్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ
చిత్రాన్ని విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీకి చెందిన
న్యాయవాది సువ్వారి శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకుడు
పి.మోహన్‌రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Finally #LakshmisNTR is now releasing on MAY 1ST in ANDHRA PRADESH ..Come watch the conspiracies that happened behind NTR ‘s back pic.twitter.com/GWyFYj4OY0— Ram Gopal Varma (@RGVzoomin) April 26, 2019
No comments:
Post a Comment