వరుస బాంబు దాడి
ఘటనలతో శ్రీలంక దద్దరిల్లుతోంది. గురువారం ఉదయం రాజధాని కొలంబోకు 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న పుగోడా పట్టణంలో పేలుడు సంభవించినట్లు పోలీసు
అధికారులు తెలిపారు. దాంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఈ దాడిలో
ఎవరైనా గాయపడ్డారా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదివారం జరిగిన భయానక దాడుల ఘటన మరువక ముందే శ్రీలంకలో మరిన్ని పేలుళ్లు సంభవిస్తున్నాయి. పోలీసులు నిర్వరామంగా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ఎక్కడో ఓ చోట పేలుడు సంభవిస్తూనే ఉంది. బుధవారం సినిమా థియేటర్‌ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు ఓ బైక్‌లో బాంబు అమర్చారు. దాన్ని గ్రహించిన పోలీసులు నిర్వీర్యం చేసే క్రమంలో అది పేలింది. ఆదివారం జరిగిన బాంబు పేలుడు ఘటనల్లో మృతుల సంఖ్య 320కి చేరింది.
No comments:
Post a Comment