తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా
చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా ఆయనకు ఊహించని సర్ ప్రైజ్ దక్కింది.
చంద్రబాబు జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు
తెలిపారు. వీరితో పాటుగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,
ఇతర నేతలు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. అయితే, జగన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికి తన
హుందాతనాన్ని చాటుకుంటూ జగన్ ఈ శుభాకాంక్షలు తెలిపారని చర్చించుకుంటున్నారు.
ఇదిలాఉండగా, ఏపీ,
తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో చంద్రబాబు జన్మదిన
వేడుకలు జరిపేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు.
No comments:
Post a Comment