A look at the Playing XI for #DCvKXIP pic.twitter.com/vLnG6HfVk0— IndianPremierLeague (@IPL) April 20, 2019
శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్‌లు అర్ధశతకాలతో చెలరేగడంతో కింగ్స్ పంజాబ్‌పై ఢిల్లీ 5 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్
నిర్ణీత ఓవర్లలో 163 పరుగులు చేయగల్గింది. ఆ లక్ష్యాన్ని
ఢిల్లీ 19.4 ఓవర్లలో ఛేదించగల్గింది. విల్ జోన్‌కు రెండు,
షమికి ఒక వికెట్ దక్కాయి.
ఐపిఎల్‌లో భాగంగా ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను క్రిస్ గేల్-కేఎల్ రాహుల్‌లు ఆరంభించారు. కింగ్స్ 13 పరుగుల వద్ద ఉండగా కేఎల్ రాహుల్(12) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్(2), డేవిడ్ మిల్లర్(7)లు కూడా విఫలం కావడంతో కింగ్స్ 61 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో గేల్-మన్‌దీప్ సింగ్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. వీరిద్దరూ 45 పరుగులు జత చేసిన తర్వాత గేల్(69; 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఔట్ కాగా, ఆపై వెంటనే సామ్ కుర్రన్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. మరో 23 పరుగుల వ్యవధిలో మన్‌దీప్ సింగ్(30) కూడా ఔట్ కావడంతో కింగ్స్ పంజాబ్ స్కోరులో వేగం తగ్గింది. చివర్లో అశ్విన్(16), హర్‌ప్రీత్ బ్రార్(20 నాటౌట్)లు సమయోచితంగా ఆడటంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఢిల్లీ బౌల ర్లలో లమిచ్చన్ మూడు వికెట్లు సాధించగా, రబడ, అక్షర్ తలో రెండు వికెట్లు తీశారు.
Sweet victory for the @DelhiCapitals who are at the No.3 rank on the #VIVOIPL points table. pic.twitter.com/zja6gJx7PU— IndianPremierLeague (@IPL) April 20, 2019
No comments:
Post a Comment