ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఎట్టకేలకి ముంబయి ఇండియన్స్ ప్రతీకారం తీర్చుకుంది. తొలి మ్యాచ్‌లోనే తమని ఓడించిన ఢిల్లీని గురువారం రాత్రి దాని సొంతగడ్డపైనే పరుగుల తేడాతో ఘన విజయం సాధించి దిల్లీపై బదులు తీర్చుకుంది. తొలుత ఓపెనర్లు డికాక్ (35: 27 బంతుల్లో 2x4, 2x6), రోహిత్ శర్మ (30: 22 బంతుల్లో 3x4, 1x6), హార్దిక్ పాండ్య (32: 15 బంతుల్లో 2x4, 3x6), కృనాల్ పాండ్య (37 నాటౌట్: 26 బంతుల్లో 5x4) దూకుడుగా ఆడటంతో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది,
అనంతరం ముంబయి నిర్దేశించిన 169 పరుగుల
లక్ష్య ఛేదనకు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది
వికెట్లు కోల్పోయి 128 పరుగులే చేసింది. ఓపెనర్లు పృథ్వీషా(20),
శిఖర్‌ధావన్(35) మొదట ధాటిగా ఆడి ఆరు ఓవర్లకు
48 పరుగులు చేశారు. అనంతరం ఏడో ఓవర్ నుంచి క్రమం తప్పకుండా
వికెట్లు కోల్పోడంతో దిల్లీ ఏ దశలోనూ విజయంవైపు సాగలేదు. కానీ.. ఇద్దరినీ వరుస ఓవర్లలో చాహర్ పెవిలియన్ బాట పట్టించగా.. అనంతరం
వచ్చిన కొలిన్ మున్రో (3), శ్రేయాస్ అయ్యర్ (3), రిషబ్ పంత్ (7), క్రిస్ మోరీస్ (11), కీమోపాల్ (0), రబాడ (9) తేలిపోయారు.
మధ్యలో అక్షర్ పటేల్(26), క్రిస్ మోరిస్(11) బ్యాట్ ఝుళిపించినా పెద్ద స్కోర్ సాధించలేకపోయారు ముంబయి బౌలర్లలో స్పిన్నర్ రాహుల్ చాహర్ (3/19), జస్‌ప్రీత్ బుమ్రా (2/18) వరుస ఓవర్లలో వికెట్లు పడగొడుతూ ఏ దశలోనూ ఢిల్లీకి కోలుకునే అవకాశం ఇవ్వలేదు.
ఢిల్లీ జట్టు వరుసగా మూడు విజయాల తర్వాత మళ్లీ ఓడిపోగా.. ముంబయికి ఇది వరుసగా
రెండో గెలుపు.
The @mipaltan are now on the No.2 position in the #VIVOIPL points table after Match 34. pic.twitter.com/8gIxcufL8g— IndianPremierLeague (@IPL) April 18, 2019
అంతకుముందు టాస్
గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు
చేసింది. కృనాల్ పాండ్య(37, 26 బంతుల్లో 5x4), హార్దిక్ పాండ్య(32, 15 బంతుల్లో 2x4, 3x6) మెరుపు బ్యాటింగ్ చేసి జట్టుని ఆదుకున్నారు. ముంబయి జట్టులో ఓపెనర్లు మెరుగైన ఆరంభమిచ్చినా.. కీలక సమయంలో ఇద్దరూ
ఔటవగా.. మిడిల్ ఓవర్లలో బెన్ కటింగ్ (2),
సూర్య కుమార్ యాదవ్ (26: 27 బంతుల్లో 2x4)
నిరాశపరిచారు ఈ క్రమంలో రోహిత్
ఔటయ్యాక బెన్‌కటింగ్(2), డికాక్, సూర్యకుమార్(26)
వెనువెంటనే పెవిలియన్ చేరారు.
దీంతో.. ముంబయి 15.1 ఓవర్లు ముగిసే సమయానికి 104/4తో తక్కువ స్కోరుకే
పరిమితమయ్యేలా కనిపించింది. ఆపై కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్య 54 పరుగుల కీలక భాగస్వామ్యం
నెలకొల్పి ముంబయి స్కోరును 168 పరుగులకు తీసుకెళ్లారు, స్లాగ్ ఓవర్లలో పోటీపడి బౌండరీలు బాదిన
పాండ్యా బ్రదర్స్ ముంబయికి మెరుగైన స్కోరు అందించారు. ఎంతలా అంటే.. ఈ జోడీ చివరి
ఐదు ఓవర్లలో ఏకంగా 62 పరుగులు రాబట్టింది. ఢిల్లీ బౌలర్లలో
రబాడ రెండు వికెట్లు పడగొట్టగా.. అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్
తలో వికెట్ తీశారు. డికాక్ రనౌట్‌గా వెనుదిరిగాడు.
Hitman @ImRo45 wins the toss and elects to bat first against the @DelhiCapitals.#DCvMI pic.twitter.com/0jwqC9VUdW— IndianPremierLeague (@IPL) April 18, 2019
No comments:
Post a Comment