తెలంగాణ ఇంటర్‌ - 2019 ఫలితాలు విడుదల - Mega Indian News

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

Thursday

తెలంగాణ ఇంటర్‌ - 2019 ఫలితాలు విడుదల




తెలంగాణలో ఇంటర్ ఫలితాలు గురువారం (ఏప్రిల్ 18) వెలువడ్డాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో సాయంత్రం గంటలకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 2,70,575 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు కాగా మొత్తం 59.8 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక ద్వితీయ సంవత్సరంలో 2,71,949 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు కాగా 65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. 
> ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్ విభాగంలో 4,09,133 మంది పరీక్షలు రాయగా 2,47, 407 మందిఒకేషనల్ విభాగంలో 43,520 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 23,168 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 
> ద్వితీయ సంవత్సరంలో జనరల్ విభాగం నుంచి 2,64, 679 మంది విద్యార్థులుఒకేషనల్ విభాగంలో 25,635 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 
> మొదటి సంవత్సరం ఫలితాల్లో 76 శాతంతో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగారంగారెడ్డి జిల్లా 71 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఇక 29 శాతంతో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 
> ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్‌ 76 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా.. కొమ్రంభీం జిల్లా 75 శాతంతో రెండో స్థానంలోమెదక్‌ జిల్లా 34శాతంతో ఆఖరు స్థానంలో నిలిచింది. 

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ?
మే 14 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు జనార్దన్‌ రెడ్డి వెల్లడించారు. . సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూలను శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రకటించనున్నారు. ఎంపీటీసీజడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్టు జనార్దన్‌ రెడ్డి తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25ను ఆఖరు తేదీగా నిర్ణయించారు



      I.P.E-March 2019 Results
  
1st Year General Results.
  
1st Year Vocational Results.
  
2nd Year General Results.
  
2nd Year Vocational Results.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages